వెల్టూరుసర్పంచ్ ను పరామర్శించిన. మాజీ మంత్రి.నిరంజన్ రెడ్డి
వనపర్తి
పెద్దమందడి మండలం, వెలటూరు గ్రామ సర్పంచ్ దండు.అశోక్ అనారోగ్య కారణంగా, రెండు రోజుల క్రితం మహబూబ్నగర్ ఆర్.ఆర్. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది, ఆదివారం రోజు తన సొంత గ్రామానికి చేరుకున్న విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , వెల్టూరు గ్రామంలోని సర్పంచ్ నివాసానికి చేరుకొని అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్నటువంటి, సర్పంచ్ అన్న దండు.నరేష్ ను, సర్పంచి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అలాగే కుటుంబ సభ్యులు ఎలాంటి దిగులు చెందోద్దు అని, వారికి ఎలాంటి అవసరం వచ్చిన మేమున్నామంటూ వారికి ధైర్యం కల్పించారు ఈ కార్యక్రమంలో, మాజీ జెడ్పిటిసి కె.రఘుపతి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సాకే. వెంకటయ్య, మాజి గ్రామ రైతుబంధు అధ్యక్షులు జి.రఘువర్దన్ రెడ్డి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ సెలక్షన్ కమిటీ మెంబర్ చిత్తూరు.కృష్ణారెడ్డి, దండు.నరేష్, సుంకరి.బుసయ్య, సుద్ద బాయి.రాజు, జింకల.బాలరాజు, తమ్మలి.రాము, జింకల.
సాయి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
