తుబాడు సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

TEJA NEWS

తుబాడు సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

నాదెండ్ల మండలం తుబాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గుమల్లి సాంబయ్య సాంబయ్య ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని కేక్ కటింగ్ చేసి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వమే సూపర్-6 సహా , పలు పథకాలు అందిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ స్వార్థం వీడి, సమాజహితం, రాష్ట్రక్షేమం కోరుకోవాలని, అదే ఏసుక్రీస్తు మనకు చూపిన సన్మార్గమని ప్రత్తిపాటి హితవుపలికారు. వ్యక్తిగత విద్వేషాలు, వైషమ్యాలు, పరనిందల్ని ప్రభువు మెచ్చడన్నారు. క్రీస్తుబోధనలు ఆచరణలో పాటిస్లూ, ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆ కరుణామయునికి ఇచ్చే గొప్పకానుకని ప్రత్తిపాటి తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, డీఎం హరిగోపాల్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, గ్రామ నాయకులు గాదె రాయపు రెడ్డి, దగ్గుమల్లి వెంకటేశ్వర్లు, షేక్ యాసిన్, రాజు, వాసుమల్ల మారియ కుమారు, వెంకయ్య గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top