లబ్ధిదారులకు సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

TEJA NEWS

లబ్ధిదారులకు సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన రాక్షల్కర్ స్వప్న రూ.15000/-,తమ్మాలి నర్సింహా రూ.60,000/-, మహేష్ గౌడ్ రూ.60,000/-ల చెక్కులు అందజేశారు..

అనంతరం పలు సమస్యలతో వచ్చిన నియోజకవర్గం ప్రజలను కలిసి ఆహ్వానాలు,వినతిపత్రాలు స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— సిఎం సహాయనిధి పేద వారికి వరంగా మారిందాన్నారు..

— తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు..

— ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమనికి, అభివృద్ధికి కట్టుబడి ఉంది అన్నారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, మహిళ సంఘాలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top