ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్యార్హత

TEJA NEWS

ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్యార్హత కొరకు అప్లికేషన్ల స్వీకరణ: మండల విద్యాధికారి ఎంవి నాగరత్నం

మండలంలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతి ఉచిత విద్య అర్హత పొందేందుకు పేద విద్యార్థులు ఈనెల20 నుండి మార్చి10వ తేదీ వరకు విద్యార్థుల నమోదు ప్రక్రియను చేపడతారని ఎడ్లపాడు మండల విద్యాధికారి ఎంవి నాగరత్నం బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.ఒకటవ తరగతిలో ఉచిత విద్య కొరకు ప్రవేశ పరీక్షలకు తమ పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్లు సమర్పించవలసి ఉంటుందని అన్నారు.ఈపరీక్షలకు హాజరు పరిచే చిన్నపిల్లల వయసు 2020 జూన్2 నుండి 2021 మార్చి31వ తేదీలోపు జన్మించినవారు అర్హులని తెలిపారు. విద్యా హక్కు చట్టం 2009ని అనుసరించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించవలసి ఉన్నందున 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల అయిందని లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని అనాధలు,హెచ్ఐవి బాధిత చిన్నారులకు, ఎన్.టి.ఎస్.సి.బి.సి, మైనార్టీలకు, సీట్లు కేటాయిస్తారని తెలిపారు.

చిరునామా ధ్రువీకరణ కొరకు ఆధార్ కార్డు,తల్లిదండ్రుల ఓటర్ ఐడి, రేషన్ కార్డు,ఉపాధి హామీ జాబ్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్ లో ఏదో ఒకటి సమర్పించవచ్చని తెలిపారు. తమ పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలతో గ్రామ వార్డు సచివాలయాలు విద్యా కేంద్రాలలో పాఠశాలల్లో నుండి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ హోటల్లో ప్రైవేట్ పాఠశాలల నమోదు ప్రక్రియను మార్చి 10వ తేదీలోపు పూర్తి చేయనున్నారని మార్చి 17వ తేదీన విద్యార్థుల అర్హత నిర్ధారణ జరుగుతుందని మొదటి విడత లాటరీ మార్చ్ 25న జరుగుతున్నది రెండో విడత లాటరీ ఏప్రిల్ 12వ తేదీన జరుగుతుందని తెలిపారు కావున ఒకటవ తరగతిలో పిల్లలను చేర్చాలనుకున్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top