ఇక నుంచి అక్కడ అర్ధరాత్రి 12 వరకూ హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి

TEJA NEWS

ఇక నుంచి అక్కడ అర్ధరాత్రి 12 వరకూ హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి*

ఏపీలోని విజయవాడ నగరం లో అర్ధరాత్రి 12 గంటల వరకూ ఇక నుంచి అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచిఉండబో తున్నాయి. నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ మేరకు పోలీసులు అనుమతి ఇచ్చారు.ఆదివారం రాత్రి నుంచే ఇవి అమల్లోకి వచ్చేశాయి. ప్రజల సౌకర్యంతో పాటు హోటళ్ల మనుగడ కోసం రాత్రి 12 గంటల వరకూ తెరిచి ఉంచాలంటూ తాము చాలాకాలంగా కోరుతున్నామని రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి.స్వామి పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top