GHMC: వీధి దీపాల నిర్వహణకు కొత్త టెండర్
LED వీధి దీపాల సమగ్ర నిర్వహణ కోసం కొత్త టెండర్లను పిలవడానికి GHMC స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రత్యేక స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. M/s EESLతో ఉన్న ఒప్పందం గడువు ముగియడంతో కొత్త టెండర్లకు కమిటీ ఆహ్వానించింది. ఈ పక్రియ పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాట్లను జోనల్ కమిషనర్ల ద్వారా చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు.
