బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి చట్టాల అవగాహన సదస్సులు కోరిన.

TEJA NEWS

బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి చట్టాల అవగాహన సదస్సులు కోరిన……… జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ వి. రజిని

వనపర్తి ;

బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో మరియు బాలికల మహాత్మ జ్యోతిబాపూలే వసతి గృహంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి విద్యార్థులకు నాల్స (లీగల్ సర్వీసెస్ టు విక్టిమ్స్ ఆఫ్ యాసిడ్ ఎటాక్ ) స్కీమ్, 2016, గృహహింస నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, ఫోక్సో చట్టం మరియు మోటార్ వాహనాల చట్టం పై అవగాహన కల్పించారు.

అదేవిధంగా కార్యక్రమంలో విద్యార్థులు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నాటికలను ప్రదర్శించారు. పదవ తరగతి విద్యార్థులను ప్రణాళికను ఏర్పాటు చేసుకుని పరీక్షలకు చదవడం వలన మంచి మార్కులు సాధించవచ్చని సూచించారు. మరియు ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. ఉచిత న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ కృష్ణయ్య కళాశాల ప్రధానోపాధ్యాయులు జై చంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top