గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట”
చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్ష,కార్యదర్సులు
“గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట” కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6-30 గంటల నుంచి 8-30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్,ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, 29వ వార్డులో క్లస్టర్,యూనిట్, అధ్యక్ష,కార్యదర్సులు,బూత్ కన్వీనర్లు మరియు ముఖ్య నాయకులను కలుపుకొని పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.వార్డులో కావలసిన రోడ్లు,డ్రైన్లు నోట్ చేసుకొని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్తామని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తోట బ్రహ్మస్వాములు, మౌలా బుడే, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, క్లస్టర్ ఇంచార్జి మస్తాన్ వలి, కో క్లస్టర్ నందం చంద్ర, యూనిట్ ఇంచార్జి కరీముల్లా,వార్డ్ అధ్యక్షలు కరిముల్ల, ప్రధాన కార్యదర్శి కాలేషా, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు బ్యాంక్ బాజీ, బూత్ కన్వీనర్లు జున్ను బుడే, కరీముల్లా, కొఠారి వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్ వలి, రంజాన్ ఖాదర్సా, అల్లబక్షు 8వ క్లస్టర్ ఇంచార్జి ముల్లా కరీముల్లా, పట్టణ కమిటీ కార్యదర్శి ముస్తఫా, అజహారుద్దీన్, బైరా సతీష్, శ్రీకాంత్,అబ్దుల్లా,ఉమర్,బడే మియా, తదితరులు పాల్గొన్నారు.
