శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్, నెహ్రూనగర్ లలో పలు సమస్యలపై మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం, విధ్యుత్ విభాగం, జిహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్, అర్బన్ ఫారెస్ట్ విభాగం, జలమండలి అధికారులతో కలిసి విస్తృతంగా పాదయాత్ర చేపట్టిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .
కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజలు నూతన సివరేజి పైప్ లైన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని చేసిన ఫిర్యాదు మేరకు అతి త్వరలో ప్రత్యేక దృష్టి సారించి నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేసేందుకు వాటర్ వర్క్స్ అధికారులతో చర్చించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సీసీ రోడ్లు దాదాపుగా పూర్తవ్వగా మిగిలిన రోడ్లు త్వరలో ప్రారంభించి పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యం పనులలో భాగంగా చెత్త సేకరణ పై ఆరా తీశారు. త్రాగునీటి క్లోరినేషన్ దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, నూతన స్స్ట్రీట్ లైట్స్, ఐ మాస్ లైట్స్ ను దశల వారిగా ఏర్పాటు చేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెహ్రూ నగర్ కబురుస్తాన్ లో పెరిగిన చెట్లను, కొమ్మలను తొలగించమని యబీడీ సిబ్బందికి ఆదేశించారు. అనంతరం రేషన్ షాప్ లో స్థానిక ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఎంహెచ్ఓ శ్రీకాంత్ రెడ్డి, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఈఈ శిరీష, డిఈ ఆనంద్, ఏఈ భాస్కర్, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, జిహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్ ఏఈ లిఖిత, డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు యాదా గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గోపినగర్ అంబేద్కర్ భవన్ అధ్యక్షులు రమేష్, ముంతాజ్ బేగం, మహేందర్ సింగ్, నరసింహ, నరసింహ రెడ్డి, పిల్లి యాదగిరి, దస్తగిరి, అలీం, ఖాదర్ ఖాన్, గౌతమ్, నరేందర్, మహేష్, నాందేవ్, షైబాజ్, వినయ్, విజయ్, సల్మాన్, విద్యుత్, యూబీడి, శానిటేషన్ సంబంధిత సిబ్బంది స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.
