ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి

TEJA NEWS

ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి

గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో సిజిఆర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలంగాణ మార్గదర్శకుడు, విశ్వవిద్యాలయ విద్యావేత్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. జయశంకర్ త్యాగాలను, తెలంగాణ ఉద్యమానికి అందించిన విలువైన సేవలను ఆయన గుర్తుచేశారు. విద్యారంగం నుండి ఉద్యమం వరకు అందరి హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలులు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మంద భాస్కర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మొగులయ్య, కొత్తపల్లి మల్లేష్ గౌడ్ కుమ్మరి ఆంజనేయులు, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు యాదవ్, సత్యనారాయణ, భాస్కర్, చంద్రారెడ్డి, ఆంజనేయులు, బీరప్ప, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top