10th పరీక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్పిన గవర్నర్
తెలంగాణ : రాష్ట్రంలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. దీంతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలన్నారు. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథంతో విద్యార్థులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని కోరుకున్నారు.
