ఘనంగా ఎమ్మెల్యే నాగరాజు జన్మదిన వేడుకలు…
తమ అభిమాన నాయకుడి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ…
వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హన్మకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమాన నాయకుడికి పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు, ప్యాడ్స్ అందించి శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు…
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు..
జన్మదిన వేడుకల సందర్భంగా క్యాంపు కార్యాలయం సందడిగా మారి, శుభాకాంక్షలతో నిండిపోయింది….
