46వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామికి ఘన సన్మానం…

TEJA NEWS

46వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామికి ఘన సన్మానం…

పెద్దపల్లి గడిచిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 46వ. డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహంకాళి స్వామిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యూనియన్ నాయకులు, సభ్యులు కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై పోరాట పటిమతో ముందుకు సాగుతూ, డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో టిజిపిఏ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు దార మధు, యూనియన్ అధ్యక్షులు రెడ్డి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మాతంగి శివరాజ్, సంయుక్త కార్యదర్శి ఆరెపల్లి కుమారస్వామి, గౌరవ సలహాదారులు గణేష్, సత్యం, సమ్మిరెడ్డి, కోశాధికారి సంజీవరెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, సభ్యులు చింతం స్వామి, భాస్కర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు, తన వెనుక అండగా నిలిచిన యూనియన్ నాయకులు, సభ్యులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top