పిల్లల హక్కుల్నికాపాడడం మన బాధ్యత : హెచ్ఎం పి.హరిత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట పట్టణ కేంద్రం
పిల్లల హక్కుల్ని కాపాడడం, వారికి రక్షణగా నిలవడం మన బాధ్యత అని కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు. అశ్వారావుపేట కాంప్లెక్సులోని పలు పాఠశాలల్లో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. కాంప్లెక్సు పరిధిలోని నందమూరినగర్ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి రోజు విద్యార్ధులు పాఠశాలకు రావాలని, సామాజిక మాద్యమాలు మాదక ద్రవ్యాల జోలుకి పోకుండా తల్లిదండ్రులుబాధ్యత వహించాలని అన్నారు. బాల్యం అందరికి అమూల్యసంపద అని బాల్యంలో ఆనందమయ జీవితాన్ని పొందేలా పిల్లల్ని ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరూ బడిలోనే ఉండేలా చూడాలని ఆమె అన్నారు. విద్యార్ధులకు బాలల హక్కులపట్ల అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్దులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, పాఠశాల ఉపాధ్యాయినిలు కరిష్మాతబుసమ్, కళ్యాణి, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
