బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ సభ్యురాలికి సన్మానం

TEJA NEWS

బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ సభ్యురాలికి సన్మానం

తిరుపతి: స్థానిక చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యురాలు భాగవతుల జయలక్ష్మిని తిరుపతిలోని అంకాలమ్మ పరమేశ్వరి దేవాలయానికి ఆలయ పాలకమండలి సభ్యురాలిగా నియమించి నందుకు ఆమెను అభినందిస్తూ సన్మానం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి గుండాల గోపినాధ్ నేతృత్వంలో క్రెడిట్ సొసైటీ సభ్యులు, చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు భాగవతుల జయలక్ష్మి, భాగవతుల శ్రీనివాస్ దంపతులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి భగవత్ సేవ చేసే అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి బ్రాహ్మణుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి, సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, లీలావతి, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top