నేను బాగున్నాను నా ఆరోగ్యం బాగుందంటూ ఎవరూ కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుండా ఉండకూడదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. హీరో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో స్థానిక కాంగ్రెస్ నాయకుడు మందలపు సాయిబాబా చౌదరి కెపిహెచ్బి కాలనీ వసంత నగర్లలో మూడు రోజులు పాటు ఏర్పాటు చేసిన క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని రమేష్ ప్రారంభించారు. ఈ సమయంలో నిన్న ఇవాళ వందల సంఖ్యలో మహిళలు పురుషులు క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు .ఈ శిబిరం రేపు కూడా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం జబ్బులను ముందే కనిపెట్టి తగు చికిత్సలు తీసుకోవడం ద్వారా మనిషి పూర్తి జీవితకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతాడన్నారు. బాలకృష్ణ ఆధ్వర్యంలోని క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మందికి క్యాన్సర్ చికిత్సలు నిర్వహిస్తున్నారు అన్నారు. సంచార వైద్యశాల ఏర్పాటు చేసి నగరంలోని అన్ని ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి ముందే క్యాన్సర్ రోగులను గుర్తించడం ద్వారా వారికి అవసరమైన చికిత్సలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. బసవతారకం ఆసుపత్రి డాక్టర్ మాట్లాడుతూ మహిళలకు క్యాన్సర్ టెస్టులు నిర్వహించి అప్పటికప్పుడే వాటి ఫలితాలను బట్టి అవసరమైన వారికి తగు సూచనలు సలహాలు చికిత్సలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గంధం రాజు, కొప్పిశెట్టి దినేష్ కుమార్, గాదే శివా చౌదరి, భాను ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
