కమిషనర్ విచారణకు రాకపోతే డీజీపీని రప్పించాల్సి ఉంటుంది

TEJA NEWS

కమిషనర్ విచారణకు రాకపోతే డీజీపీని రప్పించాల్సి ఉంటుంది

సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్

హీరో విజయ్ దేవరకొండ కేసు విచారణకు కమిషనర్ రాకుండా ఏసీపీ రావడం పట్ల అసహనం వ్యక్తం చేసిన జాతీయ ఎస్టీ కమిషన్

ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా వేడుకలో గిరిజనుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు

ఇదే అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడంతో, విచారణ చేపట్టిన కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్

ఈ నేపధ్యంలో విచారణకు హాజరు కావాలని కమిషనర్ కు నోటీసులు ఇస్తే మీరెందుకు వచ్చారు, ఆ మాత్రం తెలియదా అంటూ మాదాపూర్ ఏసీపీ పట్ల అసహనం వ్యక్తం చేసిన హుస్సేన్ నాయక్

మరో 15 రోజుల్లో హైదరాబాద్ కమిషనర్ విచారణకు హాజరు అవ్వకపోతే, డీజీపీని విచారణకు రప్పించాల్సి ఉంటుందని ఏసీపీని హెచ్చరించిన జాతీయ ఎస్టీ కమిషన్

You cannot copy content of this page

Scroll to Top