పేదలకు వైద్య సేవలకు ప్రాముఖ్యత :
మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : నిరుపేదలకు వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తామని, విద్య, వైద్య రంగాలను పేదలకు చేరువలో నిలుపుతామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ కి చెందిన రాకేష్ తీవ్ర అస్వస్థతకు గురై ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఆదుకొనేందుకు, వైద్య సేవలకు వీలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్.ఓ.సీ. పత్రాలను సమకూర్చి అందించారు. రూ.2 లక్షల ఎల్.ఓ. సీ. పత్రాలను సమన్వయకర్త రాజ సుందర్, ఇతర నేతాల సమక్షంలో అందించారు.
