మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ఆన్ లైన్ లో కూడా ఓటర్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది.

WhatsApp Image 2026 02 09 at 6.07.04 PM
TEJA NEWS

మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ఆన్ లైన్ లో కూడా ఓటర్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది…..

రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణ శ్రీ….

పెద్దపల్లి/ ఫిబ్రవరి 11. 2026 రోజున మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ఆన్ లైన్ లో కూడా ఓటర్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం ఉందని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ తెలిపారు. పోలింగ్ కేంద్రం చిరునామా , ఓటర్ క్రమ సంఖ్య తెలుసుకోవడానికి ఉపకరించే ఈ ఓటర్ స్లిప్పులను రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆద్వర్యంలో ఇప్పటికే ఇంటింటికీ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు . ఇక్కడ ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ఈ స్లిప్పులను పొందడానికి తెలంగాణ రాష్ట్రం ఎన్నికల సంఘం వెబ్ సైట్ సందర్శించి “డౌన్ లోడ్ ఓటర్ స్లిప్ బై ఎపిక్ ఐ డి అర్బన్ 2025” విండో తెరిచి జిల్లా , మునిసిపాలిటీ , వార్డు , ఎపిక్ ఐడి అనగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ వివరాలు ఇవ్వగానే ఓటర్ స్లిప్ డౌన్ లోడ్ అవుతుందని అన్నారు.

నేరుగా https://tsec.gov. in/voter SlipUlb.do అనే లింక్ తో వెబ్ సైట్ లో కెళ్ళి పై వివరాలని ఇచ్చి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు . అంతేకాకుండా టి పోల్ ( Te – Poll ) యాప్ ద్వారా కూడా ఓటర్ స్లిప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు.

You cannot copy content of this page