46వ.డివిజన్ ఇందిరానగర్‌లో నిర్వహించిన ఇందిర మహిళా శక్తి – ఇందిరమ్మ చీరాల పంపిణీ

TEJA NEWS

46వ.డివిజన్ ఇందిరానగర్‌లో నిర్వహించిన ఇందిర మహిళా శక్తి – ఇందిరమ్మ చీరాల పంపిణీ….

–ఎం.ఎస్. రాజ్ ఠాకూర్..
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదర్యంలో “మీ చిరునవ్వు బాధ్యత మాది” ఇందిరమ్మ చీరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొనడం జరిగింది. 46వ డివిజన్ ఇందిరానగర్‌లో నిర్వహించిన ఇందిర మహిళా శక్తి – ఇందిరమ్మ చీరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు చీరాలను పంపిణీ చేస్తూ వారి సమస్యలు, సంక్షేమంపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ పేరు మీద ఉన్న ఇందిరానగర్ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. మహిళల సంక్షేమం, ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ అవసరమని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
“మీ చిరునవ్వు బాధ్యత మేము తీసుకుంటాము” అని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. మహిళలకు చీరాలను పంపిణీ చేస్తూ వారి సమస్యలు, సంక్షేమంపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారి పేరు మీద ఉన్న ఇందిరానగర్ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. మహిళల సంక్షేమం, ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ అవసరమని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
“మీ చిరునవ్వు బాధ్యత మేము తీసుకుంటాము” అని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top