పౌరసరఫరాలశాఖ అధికారుల తనిఖీలలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

TEJA NEWS

పౌరసరఫరాలశాఖ అధికారుల తనిఖీలలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలంలో పౌరసరఫరాలశాఖ అధికారులు పలు ఇళ్లలో దాడులు నిర్వహించారు. ఆసుపాక కు చెందిన తాడేపల్లి ఆనందరావు ఇంట్లో ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మరియు జమ్మిగూడెం భీమవరపు గంగరాజు ఇంట్లో ఎనిమిది క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 6ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిటి ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top