గోదావరిఖని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్‌పై ఆహార భద్రతా అధికారుల తనిఖీలు…

TEJA NEWS

గోదావరిఖని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్‌పై ఆహార భద్రతా అధికారుల తనిఖీలు…

-ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్ రెడ్డి…

పెద్దపల్లి//రామగుండం: మార్చి-25.
​గోదావరిఖనిలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారులు నిర్వహించామని, ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గోదావరిఖనిలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో తీవ్ర ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయని, ఈ తనిఖీకి సంబంధించి అపరిశుభ్రత రెస్టారెంట్ వంటగది, దాని పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

​పిండి పదార్థాలలో బొద్దింకలు ఉండటాన్ని గమనించిన అధికారులు 35 కిలోల గోధుమ పిండి, 10 కిలోల మైదా పిండిని అక్కడికక్కడే పారవేయించారు.

​నిల్వ ఉంచిన మాంసం, గడువు ముగిసిన పెరుగు, తందూరి చికెన్, పచ్చి చికెన్ లివర్‌ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామని, కట్ చేసి బహిరంగంగా నిల్వ ఉంచిన సలాడ్లను నిబంధనలకు విరుద్ధంగా గుర్తించి పారవేశామని అన్నారు.

​ఆహార తయారీలో ఉపయోగిస్తున్న సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను (ఆహార రంగులు) గుర్తించి వాటిని తొలగించమని, ​ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (ఎఫ్ ఎస్ ఎస్ యాక్ట్ , 2006), లైసెన్సింగ్ నిబంధనలు (2011) ఉల్లంఘించినందుకు గాను, రెస్టారెంట్ యజమానులపై అడ్జుడికేషన్ కేసు నమోదు చేయనున్నట్లు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top