బువ్వ బండితో పేదల ఆకలి తీర్చడం అభినందనీయం

TEJA NEWS

బువ్వ బండితో పేదల ఆకలి తీర్చడం అభినందనీయం: నీలం మధు ముదిరాజ్.
తెల్లాపూర్ మున్సిపాలిటీ లో కొల్లూరు సత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహణ..
కొల్లూరు అమృత – సత్తయ్య దంపతుల వివాహ వార్షికోత్సవానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి అభినందించిన నీలం..

తెల్లాపూర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొల్లూరు భరత్ తల్లి తండ్రులు శ్రీమతి అమృత – సత్తయ్య వివాహ వార్షికోత్సవ వేడుకలకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సత్తయ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేండ్లుగా బువ్వ బండి తో పేద ప్రజల కడుపు నింపుతున్న కొల్లూరు భరత్ ను అభినందించారు.
బహుజనులు, పేదల కోసం కొల్లూరు సత్తయ్య అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వారి హక్కుల కోసం కృషి చేశారని కొనియాడారు. తండ్రి చూపిన బాటలో పయనిస్తున్న ఆయన తనయుడు భరత్ పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణ లోనే ఎక్కడ లేని విధంగా గద్దర్ విగ్రహాన్ని తెల్లాపూర్ లో స్థాపించడమే కాకుండా స్మారక పార్క్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేయడం అభినందించాల్సిన విషయమన్నారు. పేదల ఆకలి తీర్చుతూ వారికి అండగా నిలబడుతున్న సత్తయ్య దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెల్లపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ నాయికోటి కృష్ణ,వడ్డే నరసింహ,పాండు, మధుసూదన్, కిట్టు,భిక్షపతి,తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top