కాంగ్రెస్ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు పెరుగుతున్నాయి : జగదీష్ రెడ్డి

TEJA NEWS

కాంగ్రెస్ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు పెరుగుతున్నాయి : జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ రౌడీ మూకల చేతిలో హత్యకు గురైన ఉప్పల మల్లయ్య మృతదేహానికి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనతో పాటు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ నివాళులర్పించారు.


ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ“రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ఓటమి భయంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారు. బిఆర్ఎస్ మరింత బలపడుతుందని భయం మొదలైంది. రావణకాష్టంలా ఉన్న ఉమ్మడి జిల్లాలో ప్రశాంత వాతావరణం పెంచినం. పదేండ్ల కెసిఆర్ పాలనలో రాజకీయ ఘర్షణలు లేకుండా చేశామన్నారు. కాంగ్రెస్ వచ్చింది… మళ్లీ హత్యా రాజకీయాలు పెరుగుతున్నాయి. హామీల అమలులో విఫలమై దాడులకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు… కాంగ్రెస్ మంత్రుల అండదండలతోనే దాడులు పజరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పోలీసులతో కలిసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారనీ. పోలీస్ స్టేషన్లు, పోలింగ్ స్టేషన్లలో కండువాలు కప్పుతున్నారు. ఉమ్మడి జిల్లాలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పుతోంది.

దాడులు చేసిన వాళ్లకే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ఈ విషయంపై డిజిపి ప్రత్యేక దృష్టి సారిస్తే మంచిదనీ సూచించారు. పోలీసులు కంట్రోల్ చేయకపోతే ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు. అర్నేళ్ల క్రితం జరిగిన హత్యలో పోలీసుల వైఫల్యమై కారణమని చెప్పినం. పడేండ్ల ప్రశాంతతను కాంగ్రెస్ రెండేళ్లలో ఆగం చేసింది. అరాచకాలు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ప్రజల సమీకరణ ద్వారానే గుండాయిజాన్ని ఎదుర్కొంటామని ధ్వజమెత్తారు. త్వరలోనే కేటీఆర్ వస్తారు.మల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అదైర్యపడొద్దు. పార్టీ పరంగా మేమంతా ఆ కుటుంబానికి అండగా నిలబడతామన్నారు.

You cannot copy content of this page

Scroll to Top