జగన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
** ఆయన అనయూయులు కూడా చెప్పాల్సిందే
** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి “వెంకిటీల” డిమాండ్
చిత్తూరు: వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డితో సహా వైకాపా ఎమ్మెల్సీలు శ్రీ వేంకటేశ్వర స్వామి ముందు మోకరిల్లి క్షమించమని వేడుకోవాలని,
హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఆయన చిత్తూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తూనే ఉన్నారని తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని సన్నిధిలో అపచారం మీద అపచారం , పాపం మీద పాపం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. టిటిడి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రత , ప్రతిష్టను దెబ్బతీసే పనులు కొనసాగిస్తూనే ఉన్నారు.
హిందువులు , శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీ వారి లడ్డు తయారీకి వాడే ఆవు పాలతో తయారీ చేసిన నెయ్యికి బదులు వెజిటబుల్ ఆయిల్స్ లో కొన్ని రసాయన పదార్థాలు కలిపి తయారీ చేసిన కల్తీ నెయ్యిని వాడి లడ్డులు తయారీ చేయించి భక్తులకు సరఫరా చేసి మహా పాపానికి ఒడిగట్టారు. నాలుగు ల్యాబ్ రిపోర్ట్ లు కల్తీ నెయ్యిని వాడారని స్పష్టం చేసాయి. అలాగే సుప్రీమ్ కోర్టుచే నియమింపబడిన సిట్ తన ఛార్జ్ షీట్ లో కల్తీ నెయ్యిని వాడారని నిర్ధారించింది.
జగన్మోహన్ రెడ్డి బాబాయ్ , అప్పటి టిటిడి పాలక మండలి అధ్యక్షులుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి వాడారని సిట్ నిర్ధారించిందని అంగీకరించారు. చేసిన మహాపాపంను ఒప్పుకొని క్షమాపణలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి , వైకాపా నాయకులు దేవుడుతో రాజకీయాలు చేస్తూ బుకాయిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తునే ఉన్నారు. తాజాగా వైకాపా శాసన మండలి సభ్యులు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలతో ప్ల కార్డులు పట్టుకొని ర్యాలీగా శాసన మండలిలోకి ప్రవేశించి శ్రీవారిని రాజకీయాలలోకి లాగి ఆ ప్లకార్డులు ప్రదర్శించడం అత్యంత దుర్మార్గం , దారుణం.
స్వామి వారి చిత్రపటాలతో కూడిన ప్ల కార్డులను సభలోకి తీసుకు వచ్చి రాజకీయాలకు వినియోగించడమే తప్పు .
అది చాలదన్నట్లు కొందరు వైకాపా సభ్యులు చెప్పులు , బూట్లు వేసుకొని శ్రీవారి చిత్రపటాలతో ప్ల కార్డులు ప్రదర్శించడం ఘోరమైన మహా అపచారం .
సభ వాయిదా పడ్డాక శ్రీవారి చిత్ర పాటలతో కూడిన ఆ ప్ల కార్డులను టేబుల్ పై పడేసి వెళ్లి పోవడం మరీ దారుణం.
ఆతర్వాత మేము చెప్పులు , బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకోలేదని వాదించడం మరో దారుణం.
ఇటువంటి దారుణ సంఘటనలు ఇప్పటివరకు చట్ట సభలలో జరగలేదు.
జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారమే వైకాపా ఎమ్మెల్సీ లు ఈ మహా అపచారంకు పాల్పడ్డారు అని ప్రజలు భావిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి పైన జగన్మోహన్ రెడ్డికి , వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులలో కొంతమందికి గౌరవం, భక్తి , భయం , విశ్వాసం లేవు. అందుకే ఆ స్వామి పట్ల పాపం మీద పాపం , అపచారం మీద అపచారం చేస్తూనే ఉన్నారు.
