అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జేఎన్టీయూ లో శనివారం జరిగిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి స్వాగతం పలికారు. సీఎం కి కు పూల మొక్కను ఇచ్చి కార్యక్రమానికి తీసుకుని వెళ్లారు. ఈ సమయంలోనే సోమవారం రేవంత్ ప్రారంభించనున్న నల్లచెరువు పార్కు విషయమై ఇరువురు నేతలు చర్చించుకున్నారు.
