జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలి
** తిరుపతి ఆర్డీవో ఆఫీస్ వద్ద జర్నలిస్ట్ ఫెడరేషన్ ధర్నా
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా వర్కింగ్ జర్నలిస్టులకు పట్టణాల్లో 3 సెంట్ల ఇంటిస్థలం ఇచ్చి హామీ నిలబెట్టుకోవాలని జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి ఆర్.డి.ఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, తిరుపతి అధ్యక్షులు వాణి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మూడు సెంట్ల భూమి అర్హులైన పేద జర్నలిస్టులకు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించి వారిపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు వేజ్ బోర్డు ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో ఉండే జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా చిన్న పత్రికలకు అక్రిడేషన్ల కార్డుల సంఖ్య పెంచాలని కోరారు. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు తమిళనాడు తరహాలో పెన్షన్ ఇవ్వాలని కోరారు. తర్వాత ఆర్డీవో కార్యాలయం పరిపాలన అధికారి ఝాన్సీ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు శ్రీధర్, జంగం తులసిరామ్ రాయల్, వాణి, ఎస్.గౌస్ బాషా, వెంకటేష్, శేఖర్, మురళీకృష్ణ, సుబ్బరాయుడు, జయపాల్, నరసింహులు, హనుమంత్ రెడ్డి, వరదరాజులు పాల్గొన్నారు.
