హైదరాబాద్: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ , కల్యాణ్‌రామ్ నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి రామకృష్ణ, సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి నివాళి అర్పించారు. నందమూరి అభిమానులు, తెదేపా నేతలు అక్కడికి తరలివస్తున్నారు.
