మహిళల ఉన్నతే ప్రగతి:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య

TEJA NEWS

మహిళల ఉన్నతే ప్రగతి:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .

మొయినాబాద్ పట్టణంలోని అంజనీ దేవి ఫంక్షన్ హాల్ లో మున్సిపాలిటీకి సంబంధించిన మహిళలకు “మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” పేరిట డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మహిళల ఐక్యతకు ఈచీరలు ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఇందిరమ్మ మహిళా శక్తికి ప్రతీక అని, ఆమె బాటలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top