కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోకేటీఆర్,జగదీశ్వర్ రెడ్డి ల దిష్టి బొమ్మలు దగ్ధం

TEJA NEWS

కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోకేటీఆర్,జగదీశ్వర్ రెడ్డి ల దిష్టి బొమ్మలు దగ్ధం

నాగర్ కర్నూలు జిల్లా
కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బిఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అనుచితంగా,అమర్యాదగా, అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు.మొన్న అసెంబ్లీలో స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏక వచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట గలిపారు.గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారు, లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారు.

ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేశారు.ఈ విషయంలో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపు మేరకు, కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. యువజన నాయకులు. మాజీ ప్రజా ప్రతినిధులు. పార్టీ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ చౌరస్తాలో రాస్తారోకో కార్యక్రమం చేసి కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్దం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ బ్లాక్ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి. మైనార్టీ నాయకురాలు రేష్మ. పాండు గౌడ్, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top