నవంబర్ 5న కార్తీక దీపోత్సవం

TEJA NEWS

నవంబర్ 5న కార్తీక దీపోత్సవం

** యోగుల పర్వతంపై ఏర్పాట్లు : గుండాల గోపినాథ్

తిరుపతి: జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో ఉన్న యోగుల పర్వతంపై ఏకవీర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా ప్రతి ఏడాది కార్తిక దీపోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున యోగుల పర్వతంపై 1503 కిలోల ఆవు నెయ్యి, 2007 మీటర్ల ఒత్తులతో… ఆరడుగుల కొప్పెరతొ కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను తిరుపతిలోని నేరేలమ్మ ఆలయం వద్ద భక్తులు ఆవిష్కరించారు. ఈ కార్తిక దీపోత్సవానికి ప్రజలు అశేషంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మునెప్ప మునేంద్ర రెడ్డి, సాయి, విగ్రహాల కళ్యాణి, పద్మనాభం, మణి, కొండే చెంగారెడ్డి, బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top