పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి…

TEJA NEWS

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి…

-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

పెద్దపల్లి // కాల్వ శ్రీరాం పూర్ప రిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ షెడ్యూల్ కులముల బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
మాట్లాడుతూ, మండల రెవెన్యూ అధికారి నూతన కార్యాలయ నిర్మాణ పనులు పరిశీలించి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ 99 రోజుల కార్యాచరణ లో భాగంగా మండలంలో రెవెన్యూ శాఖ పరిధిలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలని సూచించారు.

మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పటిష్టంగా జరిగేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రోడ్ల పై ఎక్కడ చెత్త ఉండటానికి వీలు లేదని, పిచ్చి మొక్కలు,తొలగించాలని, ఖాళీ స్థలాలో చేత్త పేరుకు పోకుండా సంబంధిత యాజమాన్యులు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

షెడ్యూల్డ్ కులముల బాలుర వసతి గ్రహం ను ఆకస్మికంగా తనిఖీ చేసి డైనింగ్ హాల్, కిచెన్ పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాలని, వార్డెన్ సమయపాలన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాటించాలని విధులలో నిర్లక్ష్యం చెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్ జగదీశ్వరరావు, రామ్మోహన చారి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top