ఘనంగా కొండవీడు ఉత్సవాలు
ఏర్పాట్లను పరిశీలించిన మునిసిపల్ చైర్మన్ షేక్ రఫ్ఫాని
కొండవీడు చారిత్రక కొండవీడు కోటపై 7,8 తేదీలలో అనగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న కొండవీడు ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు, మునిసిపల్ చైర్మన్ షేక్ రఫ్ఫానినేడు కొండవీడును సందర్శించి, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.
పర్యాటకుల సౌకర్యం ఉత్సవాలకు వచ్చే భక్తులు, పర్యాటకుల కోసం త్రాగునీరు, వసతి, మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సాంస్కృతిక ప్రదర్శనలు కోట వైభవాన్ని చాటిచెప్పేలా రెండు రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.నిరంతర పర్యవేక్షణ ఉత్సవాలు విజయవంతం అయ్యేలా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూస్తామని చైర్మన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది, ఇతర ముఖ్య నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.
