కోదాడ పట్టణంలోని క్రాంతి ఫౌండేషన్

TEJA NEWS

కోదాడ పట్టణంలోని క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగానిర్వహించారు…

కోదాడ : స్థానిక క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.విద్యార్థులు సాంటాక్లాజ్ వేషధారణలో ఆకట్టుకోగా, క్రిస్మస్ కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రసంగాలు చేశారు. అలాగే యేసుక్రీస్తు జన్మకు సంబంధించిన ఘట్టాలను నాటికలు, పాటలు, నృత్యాల ద్వారా చక్కగా ప్రదర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాపోలు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రేమ, శాంతి, మానవత్వ సందేశాన్ని అందించే క్రిస్మస్ పండుగను విద్యార్థులు ఆచరణలో పెట్టుకోవాలని సూచించారు. సమాజంలో సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాపోలు శ్రీనివాసులు , పాఠశాల సిబ్బంది పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. చివరగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడంతో వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.

You cannot copy content of this page

Scroll to Top