క్రాంతి నగర్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నూతన కమిటీ ఏర్పాటు

TEJA NEWS
  • కుత్బుల్లాపూర్ నియోజకవర్గం)* నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలోని క్రాంతి నగర్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్న సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను హన్మంతన్న శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. సంక్షేమ సంఘాలతోనే కాలనీల అభివృద్ధి సాధ్యమవుతుందని, కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, కాలనీ అభివృద్ధికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కొలన్ జీవన్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు గంజి కోటేశ్వర్ రావు, రాఘవేంద్ర రెడ్డి, రాజాసుర, కృష్ణ చైతన్య, శ్రీధర్, వంశీ, హరిబాబు, బుగ్గారెడ్డి, నరసింహ, కమిటీ కోఆర్డినేటర్ శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top