అన్ని పోగొట్టుకొని ఒంటరిగా మారిన కుబేరుడు
అన్ని పోగొట్టుకొని ఒంటరి జీవితం సాగిస్తున్న ఓ అపర కుబేరుడు రుణ్ (పేరు మార్చడం జరిగింది )అనే వ్యక్తి ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు ఎలాంటి కుటుంబం అంటే డబ్బు కి ఎటువంటి లోటు లేదు ఆస్తులు లెక్క లేని వన్నీ, అతని దురదృష్టం అతనికి చిన్నప్పుడే మొదలయింది ఏంటి అంటే తాను వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెరగలేదు
అన్ని వాళ్ళ అమ్ముమ్మ చూసేది అతనికి ఊహ తెలిసాక వాళ్ళ అమ్మ నాన్న దగరికి పంపారు అప్పటికి ఆస్తులు ఉన్న వాళ్ళ ఇంటి పరిస్థితి బాగోలేదు వాళ్ళ అత్త మొత్తం ఆస్తులు కోర్ట్ లో వేసింది ఇంక కోర్ట్ సంగతి తెలిసిందేగా ఆ సమస్యల నుండి వాళ్ళ కుటుంబం బయట పడింది అనుకున్న సమయములో
వాళ్ళ బాబాయ్ వీళ్ళ నాన్న ని మోసం చేసి కొంచం మాత్రమే ఇచ్చాడు అప్పటికి చినోడు కనుక అతనికి ఏమి అంతగా తెలీదు ఆస్థి పంపకాలు జరిగాక అతని తండ్రి జరిగిన ద్రోహం తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు అప్పుడు ఇతను ఇంటర్ చదువుతున్నాడు తండ్రి కార్యక్రమాలకి డబ్బులు లేవు అలారు ముద్దు గా పెరిగాడు తల్లి ఇంటి పని వంట పని తప్ప ఏమి తెలీదు తల్లి నగలు తాకట్టు పెట్టి కార్యక్రమం జరిపించాడు
బాబాయ్ కోపం ఆకాశానికి చేరింది వాటాలు పంచుకోకుండా ఉంటే మొత్తం ఆస్థి తనకే దక్కెదే అని ఆ పిల్లాడి మీద నిందలు వేసి దాడులు చేపించాడు తల్లి బయపడి కొడుకుని కూతురిని తీసుకొని హైదరాబాద్ వచ్చింది.
అద్దె ఇంట్లో ఉంటూ తన ఊరిలో ఉన్న ఆస్తులు అన్ని అమ్ముకొని హైదరాబాద్ లో ఇల్లు కొనుకున్నాడు, ఊళ్ళో ఆస్తులు అమ్మే విషయంలో తనకి ఒక రెడ్డి నీకు నేను అండగా ఉంటాను అని నమ్మించి కొంత మోసం చేసాడు అయినా నాకు ఏ లాభం లేకుండా ఎవరు సహాయం చేయరు అనే గొప్ప ఆలోచనతో ఆ కుర్రాడు వదులుకున్నాడు
హైదరాబాద్ లో ఇల్లు వాకిలి ఏర్పడిన తరువాత తాను మొదటిగా ట్రావెల్స్ పెట్టాడు సక్సెస్ సాధించాడు హైదరాబాద్ లో కొన్న మూడు ఇల్లు వ్యాపారం వచ్చినా లాభాలతో రూములు వేసి అద్దెకు ఇచ్చాడు హ్యాపీ గా ఉన్న సమయంలో వాళ్ళ ఊరిలోని రెడ్డి గారు తమ్ముడు బాగున్నావా అనుకుంటూ వచ్చాడు ఏదోలే అన్న మీ దయ అని ఇంతలో ఆ రెడ్డి గారు తమ్ముడు exports బిజినెస్ ఉంది పెట్టుబడి కావాలి అని భారీ లాభాలు వస్తాయని ఆశ చూపాడు
అది నమ్మిన కుర్రాడు మొత్తం నగలు ట్రావెల్స్ తీసివేసి వచ్చిన డబ్బులు అన్ని రెడీ చేసుకొని ఉన్నాడు ఆ రెడ్డి గారు ఇంతలో ఒక దుబాయ్ షేక్ ని పరిచయం చేసాడు ఇతని పేరు మీదే మొత్తం లైసెన్సు తీసుకునేది అన్నాడు ఆ కుర్రాడు వద్దు పెట్టుబడి నాది కదా వాళ్ళ పేరు ఎలా అని అంటే నీకు చదువు లేదు కదా అని అతని పేరు మీద లైసెన్స్ తీసుకున్నారు కొంతకాలం జరుగుతుంది
ఇంతలో ఆ కుర్రాడి పెళ్లి నిశచయం పెళ్లి అయిపోవడం చక చక జరిగిపోయింది ఇంతలో బ్యాడ్ న్యూస్ చెప్పారు ఊరిలోని రెడ్డి గారు మొత్తం లాస్ అయింది అర్జెంటు గా డబ్బులు కట్టాలి లేకపోతే కేసులు పెడతారు అని బెదిరించి భయపెట్టాడు ఏమి చేయాలో అర్ధం కాని కుర్రాడు ఒక ఇల్లు అమ్మి మొత్తం డబ్బులు ఇచ్చాడు
ఇలాగ కాదు మనం వైన్స్ పెడదాం బాగా లాభాలు వస్తాయని కలిసి చేద్దాం అని మళ్ళీ ఆ ఊరిలోని రెడ్డి గారు అంటే సరే అన్న అంటూ మిగిలిన డబ్బులు కాస్త ఇచ్చాడు
ఆ రెడ్డి గారు తెలివిగా అతని అప్పులు తీర్చుకొని పెట్టుబడి సరిపోలేవు అని ఇంకో నలుగురు నీ వాటా చేర్చుకున్నాడు వైన్స్ లో తరువాత కొంతకాలనికి వైన్స్ సిట్టింగ్ లో పొడుచుకున్నారు అర్జెంటు గా డబ్బులు కావాలి లేకపోతే కేసులు అని బెదిరించాడు మళ్ళీ ఆ కుర్రాడు అప్పులు చేసి ఇచ్చాడ్డు అలా వైన్స్ ని మోసం చేసాడు ఆ రెడ్డి గారు ఇంతలోకి కుర్రాడి చెల్లి పెళ్లి కుదిరింది పెళ్ళికి ఊరిలో మిగిలిన ప్లాట్లు కొన్ని అమ్మి తన చెల్లి పెళ్లి చేసాడు
ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా ఆ రెడ్డి గారి బంధువులు వాళ్ళు సగం ఇచ్చి సగం కొంత టైమ్ పెట్టారు ఆ టైమ్ గడిచినంక ఆ కుర్రాడి దగ్గర ఉన్నాయి అన్ని లగేసుకోవాలి అని ప్లాన్ చేసాడు రెడ్డి గారు డబ్బులు అని అడగంగానే టైమ్ అయిపొయింది అన్న ఇంక ఎంత కాలం అని అడిగిందే తడవు ఆ ప్లాట్లలో ఏమి లేవు అన్ని మీ నాన్న గారు అమ్మేసారు అని భయపెట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి కట్టాలి అని వసూలు చేసాడు ఎవరు దిక్కులేని ఆ కుర్రాడు ఏమి చేయాలో అర్ధం కాక చెల్లి పెళ్ళికి చేసిన అప్పులు ప్లాట్ వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అని ఉంకో ఇల్లు అమ్మి కట్టాడు
వాళ్ళు మాత్రం డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ కాన్సల్ చేయలేదు దానికి ఆ కుర్రాడిని చార్జెస్ పెట్టుకోమన్నారు తన దగ్గర ఉంటున్న ఇల్లు తప్ప వేరే ఏమి లేదని చెప్పగా ఒక ప్లాట్ కాలిగా ఉంది అని అది అమ్మితే డబ్బులు వస్తాయి అని ఆ రెడ్డి గారు చెప్పగా సరే అన్నాడు అది అమ్మినంక అది ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మింది అని తెలిసింది ఎలాగైనా ఉంటున్న ఇల్లు కూడా అమ్మేసి ఆ డబ్బులు మొత్తం తీసుకోవాలి అని ప్లాన్ చేసాడు రెడ్డి గారు ఆ ప్లాట్ నేను సెటిల్ చేస్తాను అని అమౌంట్ తీసుకున్నాడు
ఇంతలో కుర్రాడికి ఆక్సిడెంట్ ఆరు నెలలు బెడ్ రెడ్డి గారికి ఇచ్చిన డబ్బులు మాయం, ఆ ప్లాట్ అతను తెలివిగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు కోలుకుంటున్నాడు అనే సరికి పోలీస్ లు ఉరి నుంచి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయారు ఇందులు అమ్మ చెల్లి పేరు కూడా ఉంది అంతే ఏమి చేయాలో అర్ధం కాలేదు కోర్టు లో రెడ్డి గారు ప్రత్యక్షం అన్న డబ్బులు ఇచ్చేసాను కదా మళ్ళీ ఇదేంటి అంటే వాడికి డబుల్ కావాలి అంట అని కేసులు పెట్టాడు అని రెడ్డి గారు అన్నారు అంతే ఆ కుర్రాడు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు నా దగ్గర ఏమి లేవు నన్ను బయటకి తెస్తే ఇల్లు అమ్మి ఇస్తాను అనగానే రెడ్డి గారు బయటికి బెయిల్ మీద తెచ్చాడు
ఇల్లు అమ్మటం ఇష్టం లేని కుర్రాడు లోన్ పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి మళ్ళీ ఆ రెడ్డి గారికి ఇచ్చాడు అంతే రెడ్డి గారు ఊరు వదిలి చెన్నై జంప్ ఆ ప్లాట్ వాడు ఫోన్లు ఈ కుర్రాడు రెడ్డి గారికి ఇచ్చాను ఫోన్ ఆఫ్ వస్తుంది అంటే ఎవడు నమ్మే వాళ్ళు లేరు చేసేది ఏమి లేక హైదరాబాద్ వచ్చి ఉన్న ఇల్లు అమ్మి లోన్ కట్టి ప్లాట్ అతనికి కట్టాడు
మిగతా డబ్బులు వ్యాపారం పెట్టాడు మెడికల్ కంపెనీ అది మొదట్లో బాగానే సాగింది సాగుతుంది ఆ రెడ్డి గారికి ఎందుకు అంత కక్ష కట్టాడో తెలీదు కాని అన్ని తీసుకున్న ఇంక విడి దగ్గర ఉన్నాయ్ అని తన మనుషుల్ని కంపెనీ లో చేర్చి ఎక్కడి స్టాక్స్ అక్కడ బ్లాక్ చేసి కంపెనీ లోని కుర్రాడి బంధువులకి నేర్పించి ఎవరు లేని ఒంటరి వాడిని చేసి కంపెనీ క్లోజ్ చేపించాడు అప్పటికె ఆ కుర్రాడికి ఇద్దరు పిల్లలు ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితి పిల్లని ఇచ్చిన మామ ఆ కుర్రాడితో క్లోజ్ గా ఉంటాడు అన్ని పోయిన వాళ్ళు ఉన్నారు అనుకున్నాడు అన్ని పోయినంక మామ కూతురు జీవితం నాశనం అయింది వదిలేసి వచ్చేయ్ అని ఆ తండ్రి కూతురిని అన్నాడు ఆ కుర్రాడి భార్య పిల్లలని తీసుకొని వెళ్లి పోయింది అన్ని పోగొట్టుకొని అందరూ ఉన్న ఎవరు లేని అనాధగా బతుకు పోరాటం చేస్తున్నాడు
తనకి ఎవరైనా సహాయం చేయకపోతారా మళ్ళీ తాను మంచి పోసిషన్ కి రాకపోతానా అని ఎదురు చూస్తున్నాడు
