కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన కుత్బుల్లాపూర్ టియూడబ్ల్యూజే హెచ్-143 నూతన కార్యవర్గం…
కుత్బుల్లాపూర్ టియూడబ్ల్యూజే హెచ్-143 నూతన కమిటీ వారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపుర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే హెచ్ -143 రాష్ట్ర నాయకులు శివాజీ, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు సుధీర్ మంకాల, కుత్బుల్లాపూర్ టియుడబ్ల్యుజే హెచ్ 143 నూతన కమిటీ అధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణరెడ్డి, అధ్యక్షులు సుగ్రీవుడు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి నాలేటి మాధవరెడ్డి, కోశాధికారి ఎర్రోళ్ల బాబు, ఉపాధ్యక్షులు బాన్సువాడ వెంకటేష్, జాయింట్ సెక్రటరీ ఎర్రం గుప్తా, కార్యవర్గ సభ్యులు పి శివ, ఎన్ శివ, రవీందర్, ప్రసాద్ గుప్తా, కె ప్రసాద్ తదితర జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.
తదనంతరం ప్రజాజ్వాల తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను స్థానిక జర్నలిస్ట్‌లతో కలిసి ఆవిష్కరించారు.
