వినాయక దేవాలయ వార్షికోత్సవం పాల్గొన్న స్థానిక కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …
జీడిమెట్ల కోణార్క్ హాస్పిటల్ ఎదురుగా సోనా బను మోహన్ గేటెడ్ కమ్యూనిటీ వారి ఆహ్వానం మేరకు వినాయకుడు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై ఆ వినాయకుడి కి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు…
అదె విధంగా ఆలయం ప్రాంగణంలో నిర్వహించిన హోమం మరియు ఇతర పూజ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు …
అనంతరం ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు…
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సభ్యులు పి.నరసింహారెడ్డి, కోరే ఆనంద్, రాయపు రెడ్డి, వెంకటేష్, కిరణ్ కుమార్ ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…
