అసంఘటిత రంగ కార్మికుల హక్కులు, సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన నాయకుడు కార్మిక నాయకుడు కామ్రేడ్ శీరం దుర్గారావు
సిపిఐ నగర మాజీ కార్యవర్గ సభ్యులు, ప్రముఖ కార్మిక నేత, అమరజీవి కామ్రేడ్ శీరం దుర్గారావు 10వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ 49వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక రావిచెట్టు సెంటర్లో డివిజన్ కార్యదర్శి బోర రామకృష్ణ స్వాగతం పలుకగా డివిజన్ సహాయ కార్యదర్శి కంచర్ల భార్గవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. తొలుత సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు దుర్గారావు గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లు పాల్గొన్నారు. ఈ సందర్భముగా నాయకులు మాట్లాడుతూ శీరం దుర్గారావు గారు తన జీవిత చరమాంకం వరకు కార్మిక నాయకునిగా కార్మికుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం అయన చేసిన కృషి చిరస్మరణీయం ముఖ్యంగా తన జీవితాంతం రిక్షా వర్కర్స్, వీధివిక్రయదారుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లటం ద్వారా వారి సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేశారన్నారు, అదేవిధంగా కార్మిక నాయకునిగానే కాకుండా నిరంతరం స్థానిక ప్రజాలతో మమేకం అవుతూ స్థానిక సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పాటుపడిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ దుర్గారావు గారు అన్నారు. ఆయన మరణించి 10 సంవత్సరాలు గడచిన నేటికీ రాజకీయాలకు అతీతంగా అయన స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం అయన చూపిన నిబద్దత నేటి యువతకు స్ఫూర్తి అని అన్నారు. అనంతరం 49వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి. వందలాది మంది పేదలకు, స్థానికులకు నాయకులు స్వయంగా భోజనాలు వడ్డించారు. ప్రజల సేవలోనే పరమార్థం ఉందని నమ్మిన
దుర్గారావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు మూలి సాంబశివరావు,
నగర కార్యవర్గ సభ్యులు సింగరాజు సాంబశివరావు, లంకా గోవిందరాజులు, ఏఐటీయూసీ నాయకులు కె.ఆర్.ఆంజనేయులు, బెవర శ్రీనివాసరావు, నగర పార్టీ నాయకులు పగిడికత్తుల రాము, ఆకుల యేసు, కోరంగి చిన్నారావు, నగర యువజన సమాఖ్య నాయకులు శీరం రవి, సింగంశెట్టి మోహనప్రసాద్, వెంకీ, షైనీ, రాంబాబు, బంక చాముండేశ్వరి, వైసిపి నాయకులు శీరం వెంకట్రావు, సన్నికుమార్, జగ్గు సూరిబాబు,
స్థానిక నాయకులు పిట్ట అప్పారావు గుజ్జారీ అప్పారావు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
