కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ 60 గజాల కాలనీలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండడంతో గత నెల కాలనీ వాసులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించారు.

ఈ విషయంపై హన్మంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులు ఏ.ఈ మరియు డి.ఈ తో మాట్లాడి కాలనీ ఫేజ్–1లో రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ , ఫేజ్–2లో ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించారు.
ఈ సందర్భంగా బౌరంపేట్ కాలనీ వాసులు బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి షాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

 అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంది. ప్రజల అవసరాలు మా ప్రాధాన్యం. ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కె. యాదయ్య, నారాయణ, ఎన్. రమణ, శ్రీనివాస్, రాఘవేంద్ర, కె. మల్లేష్, డి. నాగేశ్వర్ రావు, ఉపేందర్ రెడ్డి, కిషోర్, కృష్ణ, ప్రసాద్ నాయక్, సాంబశివ రావు, ఎం. శ్రీను, ఎండీ. రషీద్, కె. జీవన్ రెడ్డి, డి. లక్ష్మణ్, దుర్గ ప్రసాద్, రేణుక, సిసిందెర్ రెడ్డి, నాగశేషు, దుర్గరావు, తిరుపతి రెడ్డి, కృష్ణ, హనుమాన్, సత్యనారాయణ, మహేష్, డిలేశ్వర్ రావు, రమణ నాయక్, ఎం. ప్రమిల, భారతి, రాణి, భాగ్యలక్ష్మి, ఎస్టరమ్మ, పార్వతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top