నిత్యం యోగా సాధన చేద్దాం

TEJA NEWS

నిత్యం యోగా సాధన చేద్దాం
** టీటీడీ జేఏసీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆంజనేయులు

తిరుపతి: సమాజంలో ప్రతిఒక్కరు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజే కాకుండా ప్రతినిత్యం యోగా సాధన చేద్దామని టీటీడీ ఉద్యోగుల జేఏసీ వ్యవస్థపాక అధ్యక్షుడు ఎ.ఆంజనేయులు పిలుపునిచ్చారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన మనం భారత ప్రఖ్యాతిని చాటి ప్రపంచ దేశాలు సైతం అమలు చేసేలా చేసిందన్నారు. యోగా అనేది కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదని ఆధ్యాత్మిక పురోగతికి సోపానం లాంటిదన్నారు.
ప్రతి మనిషి ప్రతినిత్యం యోగాను దిన చర్యగా అలవర్చుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రతి ఒక్కరికీ తమ ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించేలా శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్త యోగా డే నిర్వహించడం అభినందనీయమన్నారు. మనిషి ఆరోగ్యం ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేమని అందుకు “యోగ ఒక్కటే సరైన ఔషదం అని తెలిపారు. యోగా రక్తప్రసరణకు సహకరించి గుండె జబ్బుల నివారణకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.

You cannot copy content of this page

Scroll to Top