తెలంగాణ విద్యార్థులను నైపుణ్యత లో ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం… మంత్రి వివేక్ వెంకట స్వామి
ఇండియా స్కిల్స్ 2025-26 రిజనల్ కాంపిటిషన్
గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం.
ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి వివేక్ వెంకట స్వామి
రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హా శాంతి వనం లో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఇండియా స్కిల్ రిజనల్ కాంపిటిషన్ 2025-26 నేడు ముగింపు కు చేరుకుంది.ఈ ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిధిగా మంత్రి గడ్డం వేవేక్ వెంకట స్వామి హాజరయ్యారు.ఈ కాంపిటిషన్ లో సౌత్ ఇండియా లోని 5 రాష్ట్రలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కర్ణాటక,కేరళ, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పూదుచేరి,లక్ష ద్వీప్ లకు చెందిన 300 మందికి పైగా పాల్గొన్నారు.
కాంపిటిషన్ లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ తో పాటు నగదు ప్రోత్సాహం అందజేశారు. గెలుపొందిన విద్యార్థులను త్వరలో జరగబోయే అంతర్జాతీయ కాంపిటిషన్లకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు..ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ…. యువత విద్యతో పాటు ఎదో ఒక కొత్త రంగం లో నైపుణ్యం పెంపోందించుకోవాలన్నారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఒక మంచి కాంపిటిషన్ ఏర్పటు చేశారన్నారు.రాబోయే తెలంగాణలోని యువతను నైపుణ్యం నేర్పించి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు.120 నూతన అడ్వాన్స్ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ సెంటర్ల ద్వారా నూతనంగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన యువత సిద్ధంగా ఉంటుందన్నారు.
