పోక్సో కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష, రూ.10,000/– జరిమానా

TEJA NEWS

గుంటూరు జిల్లా పోలీస్…

//పోక్సో కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష, రూ.10,000/– జరిమానా విధించిన గుంటూరు జిల్లా పోక్సో న్యాయస్థానం వారు.//

  • ముద్దాయికి శిక్ష విధించిన పోక్సో న్యాయస్థాన న్యాయమూర్తి ఎస్.ఎం.టి. మొహమ్మద్ పర్వీన్ సుల్తానా బేగం .
  • ముద్దాయి శిక్ష పడుటలో విశేష కృషి చేసిన పీపీ బర్కత్ అలీ ఖాన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ , మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి , సీఐ నరసింహారావు .
  • ముద్దాయి శిక్ష పడుటలో విశేష కృషి చేసిన అందరిని అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ .

కేసు యొక్క సంక్షిప్త వాస్తవాలు :–

ది.08.12.2020 తేదీన రాత్రి సమయంలో గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఒక ప్రాంతంలో సుమారు 9 సంవత్సరాల వయస్సు గల మైనర్ బాలికపై షేక్. నభి రసూల్ @ రహమతుల్లా, 57 సంవత్సరాలు,
శనివారపుపేట, ఏలూరు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం D.No.17/1-6, పిచ్చయ్య వీధి, గాంధీ కాలనీ, లబ్బీపేట, విజయవాడ నగరం అనే నిందితుడు అత్యాచారం మరియు తీవ్రమైన లైంగిక దాడితో కూడిన చర్యకు పాల్పడి, ఆ తరువాత నేరపూరిత బెదిరింపు చేయడం జరిగింది.

ఈ ఘటనకు సంబంధించి బాలిక తన తల్లికి మరియు ఇతరులకు నేరం యొక్క వాస్తవాలను తెలుపగా, ఆమె తల్లి మరియు ఇతర బంధువులు ఆమెను చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఈ ఘటనపై బాధితురాలు తల్లి మరియు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్లో అప్పటి డిఎస్పీ కే.రవి కుమార్ (ప్రస్తుతం రిటైర్ అయ్యారు) ఆధ్వర్యంలో C.No.169/2020 U/s 363, 376(AB), 506 IPC మరియు పోక్సో చట్టం –2012 06 r/w 5(m) సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి మహిళా ఎస్‌ఐ శ్రీమతి జె.అనురాధ బాధితురాలి యొక్క వాంగ్మూలాన్ని వివరంగా నమోదు చేసి, ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలను పోక్సో కోర్టు వారి ముందు ఉంచగా కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను, పూర్వాపరాలను పరిశీలించిన పోక్సో న్యాయస్థాన న్యాయమూర్తి ఎస్.ఎం.టి. మొహమ్మద్ పర్వీన్ సుల్తానా బేగం (ది.30.06.2025)న నిందితుడికి

  • (i) 363 IPC సెక్షన్ 235(2) ప్రకారం 3 సంవత్సరాల పాటు సాధారణ జైలు శిక్ష మరియు రూ.5000/- జరిమానా విధించబడింది
  • (ii) 506 IPC సెక్షన్ 1 సంవత్సరం పాటు సాధారణ జైలు శిక్ష విధించబడింది.
  • (iii) POCSO చట్టం సెక్షన్ 06 ప్రకారం నిందితుడికి జీవిత ఖైదు మరియు రూ.10,000/- (రూపాయలు పది వేలు మాత్రమే) జరిమానా చెల్లించడానికి శిక్ష విధించబడింది.

దర్యాప్తు అధికారి పేరు :– కె.రవి కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, దిశ పి.ఎస్.(రిటైర్డ్ డి.ఎస్.పి)

పి.పి. పేరు:- బర్కత్ అలీ ఖాన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్.

కోర్టు పేరు :–
పోక్సో కోర్ట్, గుంటూరు.

కోర్టు కానిస్టేబుల్ పేరు :–
పి.సి. 3136 మహిళా పి.ఎస్. ఎం.ఖాజా మొహిద్దీన్ బేగ్.

ఈ కేసులో పోక్సో న్యాయస్థానం వారు ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించుటలో విశేష కృషి చేసిన గుంటూరు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ శ్రీనివాసరెడ్డి ని, వాదనలు వినిపించిన పీపీ ని, కోర్టులో కేసు విచారణ ప్రక్రియను పర్యవేక్షించిన సీఐ నరసింహారావు ని, కోర్టు కానిస్టేబుల్ ను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ అభినందించారు.

You cannot copy content of this page

Scroll to Top