వివాదాల పరిష్కారానికి లోకదాలత్ ఓ సువర్ణ అవకాశం

TEJA NEWS

వివాదాల పరిష్కారానికి లోకదాలత్ ఓ సువర్ణ అవకాశం

డిసెంబర్ 21 జాతీయలోకాదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎమ్.ఆర్.సునీత సూచన

వనపర్తి :

వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణవకాశం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్ సునీత ఒక ప్రకటనలో తెలిపారు . డిసెంబర్21న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి అని . లోక్ అదాలత్ లో సివిల్ కేసులు, వివాహ సంబంధిత కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్ లు, చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను కక్షిదారులు రాజీ పడవచ్చని సూచించారు. లోక్ అదాలత్ లో కక్షిదారులు రాజీపడడం వలన డబ్బు మరియు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అని, లోక్ అదాలత్ వలన సంవత్సరాల తరబడి ఉండే కోర్టు కేసులకు తక్షణ ముగింపు, ఎటువంటి కోర్టు ఫీజు చెల్లించనవసరం లేదు అని, లోక్ అదాలత్ తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ ఉండదు అని మరియు దావా వేయడానికి కోర్టుల్లో చెల్లించిన కోర్టు ఫీజు వాపస్ చేయబడుతుంది అని ప్రకటనలో తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top