అబద్దని నిజంగా, నిజాన్ని అబద్దంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు నర్సింగ్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ACP గారికి పిర్యాదు చేసిన సంపత్ కుమార్
కేటీఆర్, హరీష్ రావు, క్రిశాంక్ లపై కేసు నమోదు
ఈ సందర్భంగా సంపత్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ
ఇద్దరు జేసీబీ ఓనర్ల మధ్య జరిగినటువంటి ఒక సంఘటనను ఆసరా చేసుకొని కుట్ర పూరితంగా, ఉద్దేశపూర్వకంగా పచ్చి అబద్దాలను నమస్తే తెలంగాణ అనే BRS పార్టీ సొంత పత్రికలో ప్రచురించి జెసిబి ఓనరు. స్థానికంగా ఉండే భాష అనే వ్యక్తికి ఇవ్వాల్సిన 8లక్షల రూపాయలు ఇవ్వకపోగా
నేను భాషాకి పైసలు ఇమ్మని వారికి చెప్తే వారు 8లక్షలను కాస్త 8కోట్ల రూపాయలు గా తీర్చిదిద్ది
ఆ డబ్బు నేను అడిగాను జెసిబికి కాదు అని చిత్రీకరించి నమస్తే తెలంగాణలో ఒక తప్పుడు వార్త ప్రచురించి
ఆ తప్పుడు వార్తను వారి యొక్క పెయిడ్ మీడియా ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు స్క్రైబ్ ,లాంటి యూట్యూబ్ ఛానెల్స్ లో విచ్చలవిడిగా ప్రచారం చేసి దాంతోపాటు
అదే ఆర్టికల్ నీ బేస్ చేసుకొని BRS పార్టీ పార్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ట్వీట్ చేయడం, హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడం, క్రిశాంక్ వాళ్ళ స్పోక్ పర్సన్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం ఈ తెలుగు స్క్రైబ్ గాని నమస్తే తెలంగాణ కానీ ఈ యూట్యూబ్ ఛానెల్స్ పచ్చి అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం ఏమాత్రం వాస్తవం లేకుండా వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా ఒక్క ముక్క కూడా నా గురించి కానీ నేను వారికి డబ్బులు డిమాండ్ చేసినట్టు కానీ ఎక్కడా లేదు .
అంత మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని నన్ను బద్నాం చేయాలని అప్రతిష్టపాలు చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూనే పదేపదే మీడియా వేదికగా చెప్పినం ఏమి లేదు చూసుకోండి ఊరికినే పేపర్ చూపించి అబద్ధాలను వక్రీకరించి మాట్లాడకండి మీ స్థాయికి అది మంచిది కాదు అని కూడా చెప్పటం జరిగింది.
చెప్పినప్పటికీ వినకుండా నా వ్యక్తిత్వ అహనానికి పాల్పడ్డారు ఏఐసీసీ కార్యదర్శిగా వివిధ రాష్ట్రాలలో పని చేస్తూ 35 సంవత్సరాలు నిష్కలంకంగా ఎక్కడ కూడా మచ్చలేకుండా 35 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్న శాసనసభ్యుడిగా పనిచేశా అటువంటినా గౌరవానికి భంగం వాటిల్లింది నా వ్యక్తిత్వాన్ని అహనం చేశారు కనుక చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి ఇప్పుడే ACP గారిని కలిసి పిర్యాదు చేయటం జరిగింది
ఈ ఫిర్యాదు కేటీఆర్, హరీష్ రావు, క్రిశాంక్, తెలుగు స్క్రైబ్, నమస్తే తెలంగాణ వీటన్నింటి బేస్ చేసుకొని నా మీద వ్యక్తిత్వ అహనానికి పాల్పడ్డారని చర్య తీసుకోమని ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది .
తర్వాత కూడా ఏ వేదికైనా పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ ఎక్కడికి అయిన పోత కానీ ఈ వ్యక్తిత్వ అహనానికి పాల్పడ్డ వారి మీద చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలి,
ఇదేవిధంగా ఒక నాకే కాదు కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడిన పచ్చి నిజం మాట్లాడిన దానిని అబద్ధంగా లేదంటే పచ్చి అబద్దాన్ని నిజంగా చిత్రీకరించడానికి మా నాయకుల మీద చాలామంది మీద చూస్తా ఉన్నారు.
ఒక పది పదిహేను రోజుల నుండి పూర్తిగా మీడియా కథనాల మీద రాష్ట్ర మొత్తం దృష్టి సారించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఆ రకంగా సొంత మీడియా పెయిడ్ చానెల్ ద్వారా కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులను మానసిక వేధింపులకు గురిచేసి వ్యక్తిత్వ ఆహనానికి పాల్పడుతూ మా గౌరవ మర్యాదలకు భంగం వాటిస్తున్నటువంటి వారందరి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం .
ఏ వేదిక ద్వార వారిని కోర్టుకు ఈడుస్తా ఇందులో నిజ స్వరూపం ఏందో తేలుస్తా ,
ఇంకోసారి బుద్ధి జ్ఞానం ఉంటే అటువంటి పని చేయకుండా చేస్తా
35 సంవత్సరాలు NSUI కార్యకర్తగా వచ్చిన సోనియాగాంధీ దయవల్ల అలంపూర్ ప్రజల ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యే అయినా
ఎమ్మెల్యే ఐదేళ్లు పనిచేస్తే శాసనసభలో BRS ను ఎండగడితే గట్టిగా మాట్లాడితే ఆనాడు మమ్మల్ని ఏం చేశారో అందరికీ తెలుసు శాసనసభ నుండి సభ్యత్వాన్ని రద్దు చేశారు దాని తర్వాత కూడా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడుతూనే ఉన్నాం గొంతు నిలపలేదు
మా గొంతు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది .
పచ్చి అబద్దాలను నిజం చేస్తున్నటువంటి వారి మీద
ఒక్క అడుగు ముందుకేసి వాళ్ల బండారాన్ని బయటపెడతాం ఈ తప్పుడు ప్రచారం చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిసంపత్ కుమార్ ACP కి ఫిర్యాదు చేయడం జరిగింది.
