నూతనంగా భాద్యతలు స్వీకరించిన రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి

TEJA NEWS

నూతనంగా భాద్యతలు స్వీకరించిన రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామిని శాలువా కప్పి సత్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు…

పెద్దపల్లి : గోదావరిఖని నూతనంగా భాద్యతలు స్వీకరించిన రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శాలువా కప్పి,సత్కరించి అభినందనలు తెలిపారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కు సంబందించి ఉమ్మడి కరీం నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో కరీం నగర్ లో ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా రామగుండం శాసన సభ్యులు ఎం.ఎస్.. రాజ్ ఠాకూర్ తో పాటు మేయర్ మహంకాళి స్వామి మంత్రిని కలిసారు.

మేయర్ ఆశీస్సులు కోరగా మంత్రి అభినందనలు తెలుపుతూ రామగుండం నగర అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు . మేయర్ మహంకాళి స్వామి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీం నగర్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసన సభ్యులు విజయ రమణా రావు , ఆది శ్రీనివాస్ , పాడి కౌశిక్ రెడ్డి , గంగుల కమలాకర్ తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top