
బడుగుల ఆశాజ్యోతి మహాత్మ పూలే
** జయంతి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నేత గుండాల గోపినాథ్
తిరుపతి: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే చిరస్మరణీయలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మహాత్మ పూలే జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ కాలనీలోని మహాత్మ పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి విద్యా విస్తరణ, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత కోసం చేసిన కృషి దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బిజెపి నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, తిరుపతి దక్షిణ మండల అధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాష్ట్ర మాజీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎస్.మస్తాన్, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవి ప్రసాద్, సీనియర్ నాయకులు మెట్టపల్లి బ్రహ్మానందం, నరసింహారెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, జనార్దన్ రెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి, తెలుగుదేశం నాయకులు చిత్రపు హనుమంతరావు, తులసి రామ్ నాయుడు, ఎల్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.