తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జనసేన యువనేత మండలనేని చరణ్ తేజ

TEJA NEWS

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జనసేన యువనేత మండలనేని చరణ్ తేజ

చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు, ప్రముఖ ప్రదాత మండలనేని చరణ్ తేజ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత మెహర్ రమేష్ ఆహ్వానం మేరకు తిరుపతి బోర్డు సభ్యులతో కలిసి చరణ్ తేజ ప్రోటోకాల్ దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా చరణ్ తేజ మాట్లాడుతూ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సమాజ హితం కోసం, జనసేన పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషిని కొనసాగిస్తానని, స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top