ఇఫ్తార్ విందులో ఐలాపూర్ మాణిక్ యాదవ్.
యూనుస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు.
ముఖ్య అతిథులుగా పఠాన్ చేరు నియోజకవర్గం కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి,యువ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ హాజరు.
అమీన్ పూర్,
పఠాన్ చేరు నియోజకవర్గం పరిధిలోని,బీరంగూడ డివిజన్ పరిధిలోని ఇసుక బావి కాలనీలో,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యునూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన.
ఇఫ్తార్ విందు కార్యక్రమంలో,పఠాన్ చేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి,ఐలాపూర్ మాణిక్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి ,వెంకట్ రెడ్డి,నర్సిములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం మాట్లాడిన నాయకులు పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు హిందూ–ముస్లిం ఐక్యతకు,సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
సమాజంలో పరస్పర గౌరవం, ప్రేమాభిమానాలు మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో విజయవంతంగా నిర్వహించబడింది.
