బోడె రామచంద్ర యాదవ్ బాటలో మరిశర్ల
- సామాజిక చైతన్యమే మూల సిద్ధాంతంగా, గత 15 ఏళ్ళుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన మరిశర్ల.
“భారత చైతన్య యువజన పార్టీ” పేరు లోనే “చైతన్యం” ఉంది
- అందుకే త్వరలోనే జిల్లాలో బీసీవై పార్టీ బలోపేతానికి చైతన్య యాత్ర
2010 నుండి పది సంవత్సరాలు స్నేహచైత్ర ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టి , గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలోని చెరువులు, ఇతర నీటి వనరుల పరిరక్షణ కోసం ప్రజల్లో చైతన్యానికి ప్రయత్నిస్తూ భారత చైతన్య యువజన పార్టీ విజయనగరం జిల్లా కన్వీనర్ గా మరిశర్ల కృష్ణ మూర్తి నాయుడు బాధ్యతలు చేపట్టటం జరిగింది .
జిల్లాలో గల అన్ని సమస్యలనూ సామాజిక చైతన్యం ద్వారానే పరిష్కారానికి కృషి చేసి, బీసీవై పార్టీని విజయనగరం జిల్లాలో బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేయనున్నట్లు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు తెలియజేశారు . బీసీవై పార్టీ ఎజెండాను మరియు పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు
